రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
  • టెన్ జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను కలిసిన రేవంత్ రెడ్డి
  • తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై చర్చించిన నేతలు
  • సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను ముఖ్యమంత్రి కలిశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగింది. తెలంగాణలో నిర్వహించిన కుల గణన అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చింది. కుల గణన, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు, తదనంతర పరిణామాలపై చర్చించారని సమాచారం.

పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా రాహుల్ గాంధీతో చర్చించారని సమాచారం. త్వరలో సూర్యాపేట, గద్వాలలో బహిరంగ సభలను నిర్వహిస్తున్నామని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.


More Telugu News