హామీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు: సోము వీర్రాజు

- ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తోందని వెల్లడి
- బటన్ నొక్కి హామీలు అమలు చేశానంటున్న జగన్ కు 11 సీట్లే ఎందుకు వచ్చాయంటూ ప్రశ్న
- ఏపీ, ఢిల్లీలో ప్రజా తీర్పులను ఓసారి గమనించాలని హితవు
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. హామీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అన్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేస్తోందని తెలిపారు.
బటన్ నొక్కి హామీలు అమలు చేసిన జగన్ కు ప్రజలు 11 సీట్లే ఎందుకు ఇచ్చారో తెలియదా? అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఢిల్లీలో ప్రజల తీర్పులు గమనించాలని... ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, దిగజారుడు ఆరోపణలు సరికాదు అని హితవు పలికారు.