శీష్ మహల్ పై విచారణకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం

శీష్ మహల్ పై విచారణకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
  • శీష్ మహల్ పునరుద్ధరణలో ఆప్ పై ఆరోపణలు
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ను దెబ్బతీసిన శీష్ మహల్ అంశం
  • శీష్ మహల్ కు దూరంగా ఉండాలని భావిస్తున్న బీజేపీ
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన శీష్ మహల్ (సీఎం అధికారిక నివాసం) పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేంద్ర ప్రజాపనుల విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నెల 13న ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. 

శీష్ మహల్ దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బంగ్లా పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. శీష్ మహల్ కు పొరుగున ఉన్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి విలాసవంతమైన శీష్ మహల్ ను విస్తరించారని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా ఆరోపించారు. ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ కు లేఖ రాశారు. 

శీష్ మహల్ అంశం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ను దారుణంగా దెబ్బతీసింది. ఆప్ పై అవినీతి ఆరోపణలు బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాయి. మరోవైపు, ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ భావిస్తోంది.


More Telugu News