హిమాలయాల్లో కేఫ్‌ ఓపెన్‌ చేసిన కంగ‌న... ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!

హిమాలయాల్లో కేఫ్‌ ఓపెన్‌ చేసిన కంగ‌న... ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!
  • మనాలిలో ‘ది మౌంటెన్‌ స్టోరీ’ పేరుతో కేఫ్‌ ను ప్రారంభించిన కంగన
  • ఇది తన చిన్న నాటి కల అని పేర్కొన్న బాలీవుడ్ క్వీన్
  • త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు
బాలీవుడ్‌ క్వీన్‌, మండి లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ హిమాలయాల్లో ఓ కేఫ్ ను ప్రారంభించారు. ఈ విషయాన్ని కంగన సోషల్‌ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. 

వాలంటైన్స్ డే సందర్భంగా మనాలిలో ‘ది మౌంటెన్‌ స్టోరీ’ పేరుతో కేఫ్‌ ను ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఇది తన చిన్న నాటి కల అని కంగన పేర్కొన్నారు. త‌న క‌ల‌ను నిజం చేయ‌డానికి త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సంద‌ర్భంగా ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. దాంతో అభిమానులు, నెటిజ‌న్లు కంగ‌నకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు. 


More Telugu News