అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు... కూటమి ప్రభుత్వ నిర్ణయం

అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు... కూటమి ప్రభుత్వ నిర్ణయం
  • వివిధ స్థాయిల్లో బ్రాండ్ అంబాసిడర్లు
  • నామినేషన్ పద్ధతిలో అర్హత, నైపుణ్యం ఆధారంగా నియామకం
  • ఏడాది కాలానికి బ్రాండ్ అంబాసిడర్ల నియామకం
రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతితో వివిధ స్థాయిల్లో బ్రాండ్ అంబాసిడర్లను నియయమించుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక స్థితి ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా, రాజధాని ప్రాంత ప్రజలతో మమేకమైన వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. 

నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని, సీఎం లేదా సీఎంవో నామినేట్ చేసినవారిని నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. నామినేషన్లతో పాటు నైపుణ్యం, అర్హత, స్థాయి ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ బ్రాండ్ అంబాసిడర్ల నియామకం ఏడాది కాలానికి వర్తించనుంది. 

అంతర్జాతీయ నగరంగా అమరావతిని ప్రమోట్ చేయడం, పెట్టుబడులు ఆకర్షించడం ఈ కార్యాచరణ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు. 


More Telugu News