సుమారు 8 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించిన పోలీసులు

సుమారు 8 గంటల పాటు వల్లభనేని వంశీని విచారించిన పోలీసులు
  • కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ముగిసిన విచారణ
  • విచారించిన అంశాలతో రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసిన పోలీసులు
  • విజయవాడ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
వైఎస్సార్ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ముగిసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు పోలీసులు వంశీని విచారించారు. విచారణలో సేకరించిన వివరాలతో రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు.

విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జీజీహెచ్ కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. వంశీని తమ రిమాండ్‌కు అప్పగించాలని పోలీసులు కోరనున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి దాడి చేశారనే ఆరోపణలు వంశీపై ఉన్నాయి. అట్రాసిటీ చట్టం ప్రకారం నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


More Telugu News