విద్యార్థుల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ సెల్ఫీ.. ఇదిగో వీడియో!

విద్యార్థుల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ సెల్ఫీ.. ఇదిగో వీడియో!
     
ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక యాత్ర‌లో భాగంగా ఈరోజు ఆయ‌న త‌మిళ‌నాడులో ప‌ర్య‌టిస్తున్నారు. కుంభ‌కోణంలోని ఆదికుంభేశ్వ‌ర‌ర్ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అక్క‌డ ప‌లువురు విద్యార్థులు, స్థానికుల‌తో ఆయ‌న సెల్ఫీ దిగారు. దీంతో వారు కేరింత‌లు కొడుతూ ఆనందం వ్య‌క్తం చేశారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను జ‌న‌సేన పార్టీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది. కాగా, జ‌న‌సేనాని ఇవాళ ఉద‌యం తంజావూరులోని స్వామిమ‌లై ఆల‌యంలో పూజ‌లు చేశారు. ఆయ‌న వెంట కుమారుడు అకీరానంద‌న్ కూడా ఉన్నారు.


More Telugu News