వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ స్పందన

వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ స్పందన
  • వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేశారన్న వైసీపీ
  • కేసు పెట్టిన సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని వెల్లడి
  • చంద్రబాబూ ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు? అని ప్రశ్న
కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వంశీని పోలీసులు అక్రమ కేసులో అరెస్ట్ చేశారని మండిపడింది. ఎక్స్ వేదికగా వైసీపీ స్పందిస్తూ.. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ పై వంశీ ఉన్నారని తెలిపింది. 

కేసు పెట్టిన సత్యవర్ధన్ కూడా ఇటీవల తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని వెల్లడించింది. కానీ, మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు... మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. వంశీని ఏపీ పోలీసులు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపింది. చంద్రబాబూ ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు? అని ప్రశ్నించింది.


More Telugu News