అకీరా నందన్‌ లేటెస్ట్‌ లుక్‌ చూశారా? గడ్డంతో అదిరిపోయాడు!

  • పవన్‌ కల్యాణ్‌తో కలిసి దేవాలయాలను సందర్శిస్తున్న అకీరా 
  • అకీరా లుక్‌ చూసి ఫిదా అవుతున్న అభిమానులు 
  • సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన తాజా ఫోటోలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్‌పైనే ఇప్పుడు మెగా అభిమానుల దృష్టి అంతా ఉంది. అకీరా తెరంగేట్రం కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో స్పష్టత లేదు. కానీ అకీరా నందన్ ఎప్పుడు కనిపించినా హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. ఈ మెగా హీరో స్టైల్, కటౌట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా అకీరా నందన్ గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా కనిపించాడు.

తండ్రి పవన్ కల్యాణ్‌తో కలిసి అకీరా నందన్ కేరళ, తమిళనాడులోని దేవాలయాలను సందర్శిస్తున్నాడు. తిరువనంతపురం సమీపంలోని తిరువళ్లలోని శ్రీ పరశురామర్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అకీరా కూడా తండ్రితోనే ఉన్నాడు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన ఫోటోల్లో అకీరా నందన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

.


More Telugu News