'తండేల్' ప్రచారానికి సాయి పల్లవి దూరం! ఎందుకో తెలుసా?
- 'తండేల్' రిలీజ్ తరువాత ప్రచారానికి దూరంగా సాయి పల్లవి
- సినిమాలో ఆమె కీలక సన్నివేశాలు తొలగించడమే కారణమని ప్రచారం
- బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న దర్శకుడు
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరోతో పాటు సమానమైన పాత్రలో సాయి పల్లవి కనిపించారు. ఆమెకు యూత్‌లో ఉన్న క్రేజ్ తెలిసిందే. సాయి పల్లవి నటించడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమా విడుదల తరువాత నాగచైతన్యతో పాటు ఆమె నటనకు కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
అయితే ఈ చిత్రానికి టాక్ బాగున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదని ట్రేడ్ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ను కొనసాగిస్తోంది. అయితే సినిమా విడుదల తరువాత ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రమోషన్‌లో కూడా సాయి పల్లవి కనిపించలేదు. ఇటీవల చిత్రబృందం ఆంధ్రా, సీడెడ్ టూర్లకు కూడా వెళ్లారు. దీంతో పాటు సక్సెస్ సెలబ్రేషన్స్, ప్రెస్‌మీట్స్, ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సాయి పల్లవి బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే దీనికి మరో కారణం కూడా ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమాలో సాయి పల్లవి నటించిన కొన్ని కీలక సన్నివేశాలు, ఆమెకు ఎంతో ఇష్టమైన సీన్స్‌ను దర్శకుడు చందు మొండేటి తొలగించడమే కారణమని సమాచారం. తన సీన్స్‌ను తొలగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, దీంతో సినిమా రిలీజ్ తరువాత ఆమె పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు చందు మొండేటి మాత్రం సాయి పల్లవిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట.