ఆ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం: కేసీఆర్

ఆ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం ఖాయం: కేసీఆర్
  • పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న కేసీఆర్
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్న కేసీఆర్
  • స్టేషన్ ఘనపూర్‌లో కేటీఆర్ ఓటమి ఖాయమని జోస్యం
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమన్నారు. ఈసారి రాజయ్య విజయం సాధిస్తారని కేసీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా కేసీఆర్‌ను కలిశారు.


More Telugu News