అందాల'నిధి'కైనా అదృష్టం కలిసి రావలసిందే!

అందాల'నిధి'కైనా అదృష్టం కలిసి రావలసిందే!
  • అందాల హీరోయిన్ గా నిధికి పేరు 
  • 'ఇస్మార్ట్ శంకర్' తో దక్కిన హిట్ 
  • ఆ తరువాత కనిపించని జోరు 
  •  ఆశలన్నీ 'రాజా సాబ్'పైనే 

వెండితెరపై హీరోయిన్ గా కనిపించడం అంత తేలికైన విషయం కాదు. ఒక సినిమాకి హీరోయిన్ ఎంపిక జరగడానికి తెరవెనుక జరిగే కసరత్తు ఒక రేంజ్ లో ఉంటుంది. చివరి నిమిషం వరకూ ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఉంటుందో లేదో అనేది ఎవరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ గా ఛాన్స్ సంపాదించుకోవడం... హిట్ కొట్టడం... స్టార్ డమ్ సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి. 

అలా ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్, గ్లామర్ పరంగా ఫస్టు మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక త్వరలో సెట్స్ పైకి వెళ్లే ప్రాజెక్టులలో చాలావరకూ పంచదార బొమ్మలాంటి ఈ అమ్మాయినే ఉంటుందని అంతా అనుకున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తరువాత ఇక ఈ బ్యూటీ కెరియర్ ను ఆపడం ఇప్పట్లో ఎవరి వలన కాదనే టాక్ వినిపించింది. స్టార్ హీరోలతో ఆమె జోరు కొనసాగడం పక్కా అనుకున్నారు. కానీ ఆమె ఒక్కసారిగా కొత్త కుర్రాడితో 'హీరో' సినిమా ఒప్పుకుని అందరికీ కలిపి ఒకేసారి షాక్ ఇచ్చింది.

ఆ తరువాత నిధి అగర్వాల్ పవన్ సరసన నాయికగా 'హరిహర వీరమల్లు' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెట్ పైకి వెళ్లిన ఈ సినిమా, ఇంతవరకూ బయటికి రాలేకపోయింది. నిజానికి నిధి అగర్వాల్ ఒక సౌందర్య శిల్పం వంటి అమ్మాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడో లెక్కలు తప్పడం వలన కెరియర్ తడబడుతూనే ఉంది. ఇక త్వరలో రానున్న ప్రభాస్ సినిమా రాజా సాబ్ లో ఆమె నటించింది. మారుతి దర్శకత్వం వహించిన సినిమా ఇది. మే 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా అయినా నిధి కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తిస్తుందేమో చూడాలి. 


More Telugu News