మీ పిల్లలను మంచిగా పెంచాలనుకుంటే.. ఇలాంటి ఇడియట్స్ ను దూరం పెట్టండి... రేణు దేశాయ్ సంచలన పోస్ట్

- సోషల్ మీడియాతో గాడి తప్పుతున్న యువత
- సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రణవీర్ అలహాబాదియా మాటలపై మండిపడ్డ రేణు దేశాయ్
- కామెడీకి, బూతులకు తేడా తెలియడం లేదా? అంటూ చురకలు
'ఇండియా గాట్ లేటెంట్' అనే షోలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు రణవీర్ అలహాబాదియా, సమయ్ రైనా, అపూర్వ ముఖిజ చాలా చెత్తగా మాట్లాడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రణవీర్ మాట్లాడిన మాటలు అయితే సభ్య సమాజం సిగ్గు పడేలా ఉన్నాయి.
షోలో భాగంగా ఓ మహిళా కంటెస్టెంట్ ను అతడు అడగకూడని ప్రశ్న వేశారు. "మీ పేరెంట్స్ శృంగారం చేయడం జీవితాంతం చూస్తావా? లేక ఒకసారి నువ్వే సెక్స్ లో పాల్గొని దాన్ని శాశ్వతంగా ఆపేస్తావా? అని అడగడం జరిగింది. దీంతో అతని ప్రశ్న విన్న షోలోని మిగతా వారు షాక్ అయ్యారు. ఈ షో తాలూకు వీడియో నెట్టింట వైరల్ కావడంతో అలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడినందుకు రణవీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
దాంతో తన తప్పు తెలుసుకున్న అతడు తర్వాత క్షమాపణ చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా సద్దుమణగ లేదు. ఇంకా అందరూ రణవీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ఏకిపారేస్తోంది.
దీనిపై తాజాగా రేణు దేశాయ్ కూడా స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రణవీర్ పై ఆమె మండిపడ్డారు. "మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచాలి అనుకుంటే... ఇలాంటి ఇడియట్స్‌కి దూరంగా ఉండాలి.. వారిని అన్ ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తోంది" అంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రేణు దేశాయ్ చెప్పింది వందకు వందశాతం కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.