యాంక‌ర్ ఉద‌య‌భాను కూతుళ్ల‌కు నారా బ్రాహ్మణి స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇదిగో వీడియో!

యాంక‌ర్ ఉద‌య‌భాను కూతుళ్ల‌కు నారా బ్రాహ్మణి స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇదిగో వీడియో!
 
టాలీవుడ్ యాంకర్, న‌టి ఉదయభాను త‌న కూతుళ్ల‌కు నారా బ్రాహ్మణి ఇచ్చిన ఓ స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ కు సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. బాలయ్య బాబు బిడ్డ బ్రాహ్మణి త‌న కుమార్తెల‌కు స్పెష‌ల్ గిఫ్ట్ పంపించ‌డం ఆనందంగా ఉందంటూ వీడియోను ఉద‌య‌భాను షేర్ చేశారు. 

ఇక వీడియోలో ఉద‌య‌భాను గిఫ్ట్ ప‌ట్టుకుని త‌న క‌వ‌ల పిల్ల‌ల వ‌ద్ద‌కు వెళ్లి.. బాల‌య్య మామ అంటే ఎవ‌రికి ఇష్టమ‌ని ఆడ‌గ‌డం ఉంది. దాంతో ఆమె ఇద్ద‌రు కూతుళ్లు చేతులెత్త‌డంతో మీకో గిఫ్ట్ పంపించార‌ని చెబుతుంది. ఆయ‌న బిడ్డ బ్రాహ్మ‌ణి మీకు వ‌యోలిన్ గిఫ్ట్‌గా పంపించార‌ని చెప్ప‌డంతో వారు స‌ర్‌ప్రైజ్ అవుతారు. ఆ త‌ర్వాత త‌మ‌కు ప్ర‌త్యేక బ‌హుమ‌తి పంపించిన బాలకృష్ణ, బ్రాహ్మణిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బ్రాహ్మణి మంచి మ‌న‌సును నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.  


More Telugu News