చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి... వీడియో ఇదిగో!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి... వీడియో ఇదిగో!
  • రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో దాడి
  • రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలన్న దుండగులు
  • రంగరాజన్ నిరాకరించడంతో దాడి
హైదరాబాదులోని సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుడ్ని కూడా దుండగులు గాయపరిచారు. 

ఈ దాడిపై రంగరాజన్, చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

కాగా, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని పలు హిందూ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.


More Telugu News