పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ప్యాట్ క‌మిన్స్ భార్య

పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ప్యాట్ క‌మిన్స్ భార్య
    
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ భార్య బెకీ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చారు. ఆ పాపకు 'ఈదీ' అని పేరు పెట్టిన‌ట్లు క‌మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. "మా అందమైన పాప ఈదీ. ఈదీత్ మరియా బోస్టన్ కమిన్స్. మేము ఇప్పుడు ఎంత ఆనందంగా, ప్రేమతో నిండిపోయామో మాటల్లో వర్ణించలేము" అని క‌మిన్స్ త‌న ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

కాగా, క‌మిన్స్, బెకీ దంప‌తుల‌కు ఇప్ప‌టికే ఆల్బీ అనే ఓ కుమార్తె ఉంది. మ‌రోవైపు భార్య డెలివ‌రీ నేప‌థ్యంలో శ్రీలంక‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు క‌మిన్స్ దూర‌మ‌య్యాడు. అటు గాయం కార‌ణంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ అత‌డు ఆడ‌డం లేదు.


More Telugu News