ధనవంతులు, రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి: ఎంపీ పప్పు యాదవ్

ధనవంతులు, రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి: ఎంపీ పప్పు యాదవ్
  • అప్పుడే వారికి మోక్షం లభిస్తుందన్న బీహార్ స్వతంత్ర ఎంపీ
  • కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వారు మోక్షం పొందారని ఒక బాబా చెప్పారన్న పప్పు యాదవ్
  • బాబాలు, సంపన్నులు, రాజకీయ నాయకులు త్రివేణీ సంగమంలో చనిపోయి మోక్షం పొందాలని సూచన
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలని బీహార్ స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజ్ (పప్పు యాదవ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అక్కడ జరిగిన తొక్కిసలాటను ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

లోక్‌సభలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట తర్వాత 300-600 మంది వరకు చనిపోయారని, వారి మృతదేహాలను అక్కడి నుంచి తొలగించారని పేర్కొన్నారు. మృతులకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందారని ఒక బాబా చెప్పారని తెలిపారు. కాబట్టి రాజకీయ నాయకులు, సంపన్నులు, బాబాలు కూడా త్రివేణీ సంగమంలో మునిగి చనిపోయి మోక్షం పొందాలని, అలాంటి బాబాలకు అప్పుడే మోక్షం లభిస్తుందని పప్పు యాదవ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


More Telugu News