తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎల్లుండికి వాయిదా

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎల్లుండికి వాయిదా
  • తిరుపతిలో నేడు డిప్యూటీ మేయర్ ఎన్నికలు
  • ఉద్రిక్తతల కారణంగా ఎన్నికలు వాయిదా
  • ఫిబ్రవరి 5న ఎన్నికలు జరపాలని అధికారుల నిర్ణయం
నేడు జరగాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు బుధవారానికి వాయిదా పడ్డాయి. వైసీపీ, కూటమి పార్టీల మధ్య తీవ్రస్థాయి ఘటనల నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎల్లుండి (ఫిబ్రవరి 5) నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ప్రకటించారు. 

ఎన్నికలు నిర్వహించాలంటే 26 మంది కార్పొరేటర్లు హాజరు కావాల్సి ఉండగా, 23 మంది కార్పొరేటర్లే అందుబాటులో ఉండడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. 

కూటమి నేతలు తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని, తమపై దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సును అడ్డుకున్నారని, తమ కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు యత్నించారని ఎంపీ గురుమూర్తి ఆరోపణలు చేశారు. బస్సు టైర్లకు గాలి తీసేసి, తాళాలు లాగేసుకున్నారని వివరించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.


More Telugu News