గిరగిరా తిరుగుతున్న భూమిని మీరెప్పుడైనా చూశారా?.. వీడియో ఇదిగో!

గిరగిరా తిరుగుతున్న భూమిని మీరెప్పుడైనా చూశారా?.. వీడియో ఇదిగో!
  • భూ భ్రమణాన్ని రికార్డు చేసిన ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్
  • హాన్లే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న అంగ్‌చుక్
  • 24 గంటల టైమ్ ల్యాప్స్ వీడియోను షేర్ చేసిన వైనం
భూమి తన చుట్టూ తాను తిరగడంతోపాటు సూర్యుడి చుట్టూ తిరుగుతుందనే విషయం మనకు తెలుసు కదా! అయితే, భూమి ఎలా తిరుగుతుందో చూడాలన్న కుతూహలం మనలో చాలామందికి ఉంటుంది. దీనిని గుర్తించిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ లడఖ్ లో భూ భ్రమణాన్ని వీడియోలో బంధించారు. 

హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న అంగ్‌చుక్ 24 గంటలపాటు టైమ్ ల్యాప్స్ ను ఉపయోగించి భూభ్రమణాన్ని వీడియో తీశారు. ఈ మొత్తాన్ని ఆ తర్వాత ఒక నిమిషం నిడివికి కుదించారు. ఈ వీడియోలో భూమి మాత్రమే తిరుగుతుండగా, నక్షత్రాలు నిశ్చలంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో చిత్రీకరణ కోసం తాను చాలా ఇబ్బందులు పడినట్టు అంగ్‌చుక్ తెలిపారు. తనకు వచ్చిన అభ్యర్థన మేరకు ఈ వీడియోను చిత్రీకరించినట్టు చెప్పారు. 


More Telugu News