కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన

కుంభమేళా తొక్కిసలాటపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందన
  • మహా కుంభమేళాలో విషాదం
  • భారీ తొక్కిసలాటలో 15 మంది మృతి!
  • ఈ ఘటన తీవ్ర విచారం కలిగించిందన్న చంద్రబాబు
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో విషాద ఘటన చోటుచేసుకోవడం తెలిసిందే. గత అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ దిగ్భ్రాంతికర ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో విషాదకర రీతిలో తొక్కిసలాట తీవ్ర విచారాన్ని కలిగించిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.


More Telugu News