ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డు

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డు
  • మూడో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి
  • ఇంగ్లండ్‌తో జరిగిన ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు
  • 10 మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఓవరాల్‌గా మూడో స్థానం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్పిన్పర్ వరుణ్ చక్రవర్తి రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో వరుణ్ చక్రవర్తి 24 పరుగులిచ్చి 5 వికెట్లు నేలకూల్చాడు. వరుణ్ పదునైన బంతులకు కెప్టెన్ జోస్ బట్లర్, జేమీ స్మిత్, జేమీ ఓవెర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రో అర్చర్ వంటివారు పెవిలియన్ చేరారు. దీంతో 83/1తో బలంగా కనిపించిన ఇంగ్లండ్ జట్టు ఆ తర్వాత 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 

గతేడాది టీ20లోకి తిరిగి వచ్చిన వరుణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి 10.96 సగటు, 7.4 ఎకానమీతో 27 వికెట్లు తీసుకున్నాడు. 17 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. మొత్తంగా 16 మ్యాచుల్లో 29 వికెట్లు తీసుకున్నాడు.

కాగా, తాజా మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనత సాధించిన వరుణ్.. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో 10 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో 10 మ్యాచుల్లో 25 వికెట్లు సాధించిన కుల్దీప్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా చూసుకుంటే వరుణ్ మూడో స్థానంలో ఉన్నాడు. మలేసియా ఆటగాడు శ్యాజ్రుల్ ఇద్రుస్ 28 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 30 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 26 పరుగులతో విజయం సాధించి సిరీస్‌లో ఖాతా తెరిచింది. 


More Telugu News