2022-24 కాలంలో ఏపీలో విద్యాప్రమాణాలు దిగజారాయి: ఏఎస్ఈఆర్

2022-24 కాలంలో ఏపీలో విద్యాప్రమాణాలు దిగజారాయి: ఏఎస్ఈఆర్
  • విద్యా ప్రమాణాలపై ఏఎస్ఈర్ నివేదిక
  • గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు లెక్కలు చేయడం కూడా రావడంలేదని వెల్లడి
  • 3వ తరగతి పిల్లలు 2వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారని వివరణ
2018-24 మధ్య విద్యా ప్రమాణాలపై ఏఎస్ఈఆర్ (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2022-24 మధ్య కాలంలో ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారినట్టు ఏఎస్ఈఆర్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు గణితంలో వెనుకబడి ఉన్నారని నివేదిక తెలిపింది. వారికి లెక్కలు చేయడం కూడా రావడంలేదని పేర్కొంది.

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే 6 నుంచి 14 ఏళ్ల పిల్లలు 2018లో 63.2 శాతం ఉంటే... 2024 నాటికి అది 61.8 శాతానికి తగ్గిందని వివరించింది. 

15 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల పాఠశాల నమోదు శాతం కూడా 2018లో 9 శాతం ఉంటే... 2024లో మరీ దారుణంగా 1.3 శాతానికి పడిపోయిందని ఏఎస్ఈఆర్ వెల్లడించింది. 

3వ తరగతి చదివే పిల్లల్లో 2వ తరగతి పాఠ్యపుస్తకాలు చదివే సామర్థ్యం ఉన్న వారు 2018లో 22.4 శాతం ఉంటే... 2022లో 10.4 శాతానికి పడిపోయినట్టు వివరించింది.


More Telugu News