'ఈనో' స్టోరీలు ప్రజలు నమ్మడం లేదనే రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు: హరీశ్ రావు

- పెట్టుబడుల కట్టుకథను నమ్మించేందుకు చేసిన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిందన్న మాజీ మంత్రి
- పెట్టుబడులపై సీఎం, డిప్యూటీ సీఎం చెప్పిన మాటల్లో ఎవరిది నమ్మాలని ప్రశ్న
- రైతు భరోసా గడువును మార్చి 31కి పెంచారని విమర్శ
ప్రెస్ రిలీజ్‌లు, మీడియా కవరేజీలు, 'ఈనో' స్టోరీలను ఎవరూ నమ్మడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టాడని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఆయన ప్రెస్‌మీట్ ఎలా ఉందంటే... పెట్టుబడుల కట్టుకథను నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎద్దేవా చేశారు.
ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... దావోస్ పెట్టుబడులు ఎప్పుడో అయిపోయిన కథ అని, ఇప్పుడు మాట్లాడటమేమిటని విమర్శించారు. దావోస్‌లో జరిగిన ఎంవోయూలన్నీ 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' మాత్రమే అని ఆరోపించారు. ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిందేనని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారని, రేవంత్ రెడ్డి మాత్రం లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెబుతున్నారని విమర్శించారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజమని ప్రశ్నించారు.
దావోస్ పెట్టుబడులంటూ సీఎం చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలన్నీ పొంతన లేకుండా ఉన్నాయని, దీనిని ప్రజలు గమనించారని అన్నారు. రైతు భరోసా కోసం రైతులంతా కొండంత ఆశతో ఎదురు చూస్తుంటే... వారి ఆరాటాన్ని చిల్లర పంచాయితీ అనడం విడ్డూరమన్నారు. సంక్రాంతికి ఇస్తానన్న రైతు భరోసాను ఇప్పుడు మార్చి 31కి వాయిదా వేశారని మండిపడ్డారు. దావోస్ సెల్ఫ్ డబ్బాకు, వెకిలి సెటైర్లకు కాలం చెల్లిందన్నారు. రేవంత్ రెడ్డి మంచి మానసిక వైద్యుడిని సంప్రదించడం మంచిదని హరీశ్ రావు సూచించారు.