విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదం

విజయసాయిరెడ్డి రాజీనామా ఆమోదం
  • విజయసాయి రాజీనామాను ఆమోదించిన‌ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌క‌డ్‌ 
  • రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్‌లో అందజేయడంతో వెంటనే ఆమోదం
  • ఈ మేర‌కు బులెటిన్ విడుద‌ల చేసిన రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ 
విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌క‌డ్‌ ఆమోదించారు. విజయసాయి తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మట్ లో అందజేయడంతో ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. ఈ మేర‌కు రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ బులెటిన్ విడుద‌ల చేశారు. 

కాగా రాజీనామా చేసిన తరువాత విజయసాయి మీడియాతో మాట్లాడుతూ... పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేశానని అన్నారు. ఇక భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని, పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని తెలిపారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్‌గా మారలేదని చెప్పిన విజయసాయి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని పేర్కొన్నారు. 

అదే స‌మ‌యంలో కేసుల నుంచి బయటపడడానికే తాను రాజీనామా చేశానంటూ వస్తున్న విమర్శలపై ఆయ‌న‌ ఘాటుగా స్పందించారు. ఎవరి చేతో కేసులు మాఫీ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో తాను లేనని చెప్పారు. 


More Telugu News