యాచకురాలికి భిక్షమేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఇందోర్ పోలీసులు

యాచకురాలికి భిక్షమేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఇందోర్ పోలీసులు
  • ఇందోర్‌లో భిక్షాటనపై నిషేధం విధించిన అధికారులు
  • భిక్షకులకు సాయం చేసినా కఠిన చర్యలు 
  • దేవాలయం వద్ద యాచకుడికి డబ్బులు ఇచ్చిన వ్యక్తి
  • బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ యాచకురాలికి డబ్బులు దానం చేసినందుకు గాను ఓ వ్యక్తిపై ఇందోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు స్థానిక అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలో భిక్షాటనను నిషేధించింది. భిక్షకులకు సాయం చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇందులో భాగంగా ఓ దేవాలయం వద్ద డబ్బులు ఇచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్ఎస్‌లోని సెక్షన్ 233 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరం రుజువైతే అతను జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో ఇందోర్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇందోర్ అధికారులు భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించారు. యాచకులు కనిపిస్తే దానం చేయవద్దని... వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు సూచించారు.


More Telugu News