దావోస్ ఖ‌ర్చెంత?... పెట్టుబ‌డులు ఎన్ని?: అంబ‌టి రాంబాబు

దావోస్ ఖ‌ర్చెంత?... పెట్టుబ‌డులు ఎన్ని?: అంబ‌టి రాంబాబు
   
ఏపీలోని కూట‌మి స‌ర్కార్‌ కు దావోస్ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప‌లు ప్ర‌శ్నలు సంధించారు. దావోస్ నుంచి ప్ర‌భుత్వం ఎన్ని పెట్టుబ‌డులు తెచ్చింద‌ని, అక్క‌డికి వెళ్లి రావ‌డానికి ఎంత ఖ‌ర్చు చేసిందని ఆయ‌న ప్ర‌శ్నించారు.

"దావోస్ వెళ్ళిరావడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దావోస్ నుంచి పెట్టుబడులు ఏమేరకు తెచ్చారు? తెలియపరిస్తే వినాలని ఉంది!" అంటూ అంబ‌టి ట్వీట్ చేశారు. కాగా, సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేశ్ దావోస్ లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ ఎకనామిక్ ఫోరంలో స‌ద‌స్సులో పాల్గొన్న విష‌యం తెలిసిందే. 

 నాలుగు రోజుల పాటు అక్క‌డ వ‌రుస స‌మావేశాల‌తో బిజీగా గ‌డిపిన చంద్ర‌బాబు ఇవాళ తిరుగు ప‌య‌నం కాగా, మంత్రి లోకేశ్ ఇంకా అక్క‌డే ఉన్నారు. 


More Telugu News