ఆర్జీ కర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌కి ఉరిశిక్ష పడేలా అప్పీల్‌కు వెళతాం: సీబీఐ

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌కి ఉరిశిక్ష పడేలా అప్పీల్‌కు వెళతాం: సీబీఐ
  • సంజయ్ రాయ్‌కు యావజ్జీవ శిక్షను విధించిన సీల్దా కోర్టు
  • కింది కోర్టు తీర్పుపై కోల్‌కతా హైకోర్టులో అప్పీల్‌కు సిద్ధమైన సీబీఐ
  • మరణశిక్షకు అర్హమైన కేసంటూ సీబీఐకి న్యాయ సలహా అందడంతో నిర్ణయం
ఆర్జీ కర్ హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష పడేలా తాము అప్పీల్‌కు వెళతామని సీబీఐ తెలిపింది. సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పుపై కోల్‌కతా హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. 

ఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి వస్తుందని, మరణశిక్షకు అర్హమైనదంటూ సీబీఐకి న్యాయ సలహా అందడంతో... దోషికి మరణశిక్షను విధించాలని హైకోర్టును కోరనుంది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సవివరమైన వాదనలతో శుక్రవారం నాటికి అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సీబీఐ తెలిపింది.


More Telugu News