తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్

తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్
  • వారం రోజుల క్రితం సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్ దుండగుడు
  • గాయాలపాలైన సైఫ్‌ను ఆటోలో ఆసుపత్రికి తరలించిన భజన్ సింగ్ రానా
  • సకాలంలో ఆసుపత్రికి తరలించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈరోజు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశారు. వారం రోజుల క్రితం ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి జొరబడ్డాడు. చోరీకి ప్రయత్నించగా సైఫ్ అలీఖాన్ అడ్డుకోవడంతో కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు.

సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడిన సమయంలో అతనిని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలో దగ్గరి దారిలో ఆసుపత్రికి తరలించాడు. తనను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్షించినందుకు గాను సైఫ్ అలీఖాన్... ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులనూ ఇలాగే ఆదుకోవాలని సూచించారు. సైఫ్ అలీఖాన్ ఆటో డ్రైవర్‍‌ను కలిసిన సమయంలో వెంట తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు.


More Telugu News