మ‌హారాష్ట్ర‌ సీఎం అర్ధాంగి వీడియో వైర‌ల్‌

మ‌హారాష్ట్ర‌ సీఎం అర్ధాంగి వీడియో వైర‌ల్‌
    
మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అర్ధాంగి అమృత ఫడ్నవీస్ మంగ‌ళ‌వారం నాడు ముంబ‌యిలో జ‌రిగిన టాటా ముంబ‌యి మార‌థాన్‌లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ డ్రెస్‌లో వ‌చ్చిన ఆమె అక్క‌డి నిర్వాహ‌కులు, మార‌థాన్ ఔత్సాహికుల‌తో క‌లిసి సంద‌డి చేశారు. 

అక్క‌డ కొంత‌మంది ఆమెతో ఫొటోలు కూడా దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా పంచుకున్నారు. దీంతో వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

'ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న 'డ్రీమ్ రన్' (టాటా ముంబ‌యి మార‌థాన్‌)ను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంది. 20 సంవత్సరాలకు పైగా ఈ క్రీడా కార్యక్రమం ప్రజలను ఏకం చేస్తోంది. ఈ ఈవెంట్ నాకు సమాజం కోసం ఏదైనా చేసే అవకాశం కల్పించింది. సోదర బంధాలను పెంచేందుకు దోహదపడింది. అలాగే రన్నింగ్‌ను క్రీడగా ప్రాచుర్యంలోకి తెచ్చింది' అంటూ అమృత ట్వీట్ చేశారు. 

కాగా, ప్రొఫెష‌న్ ప‌రంగా న‌టి అయిన అమృత ఫడ్నవీస్ ప‌లు మ‌రాఠీ సినిమాల్లో న‌టించారు. అలాగే ఆమె గాయ‌నిగానూ రాణించారు.   




More Telugu News