యోనో యాప్ పై కీలక ప్రకటన చేసిన ఎస్‌బీఐ

యోనో యాప్ పై కీలక ప్రకటన చేసిన ఎస్‌బీఐ
  • యోనో యాప్ వాడే ఎస్‌బీఐ కస్టమర్లు ఆండ్రాయిడ్ 12, అంత కంటే ఎక్కువ వెర్షన్ మొబైల్స్ వాడాలి
  • పాత వర్షన్ మొబైల్‌లో మార్చి 1 నుంచి యోనో సేవలు బంద్ అవుతాయన్న ఎస్బీఐ
  • ఎస్బీఐ ఖాతాదారులు కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచన 
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు యోనో యాప్ ద్వారా సేవలు మరింత చేరువ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యోనో యాప్ వినియోగంపై ఎస్‌బీఐ కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఎస్‌బీఐ కీలక సూచనలు చేసింది.

ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో త్వరలోనే యోనో సేవలు నిలిపి వేయనున్నట్లు తెలిపింది. వెంటనే ఎస్‌బీఐ ఖాతాదారులు కొత్త వెర్షన్ మొబైల్‌కి మారాలని సూచించింది. ఈ విషయాన్ని ఖాతాదారులకు సందేశాల ద్వారా తెలియజేస్తోంది. ఆండ్రాయిడ్ 12 అంతకంటే ఎక్కువ వెర్షన్ మొబైల్‌కి అప్‌గ్రేడ్ కావడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది. 

అప్పటి వరకూ మాత్రమే యోనో సేవలు ఆండ్రాయిడ్ 12 కంటే తక్కువ వెర్షన్ మొబైల్ వాడే వారు కూడా పొందే అవకాశం ఉంటుంది. పాత వెర్షన్ మొబైల్స్‌లో మార్చి 1 నుంచి యోనో సేవలు నిలిచిపోతాయని ఖాతాదారులకు ఎస్‌బీఐ స్పష్టం చేసింది.                                        


More Telugu News