రష్యా తరపున యుద్దం చేస్తున్న 16 మంది భారతీయులు మిస్సింగ్

రష్యా తరపున యుద్దం చేస్తున్న 16 మంది భారతీయులు మిస్సింగ్
  • ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న భారతీయులు
  • ఇప్పటివరకు 12 మంది మృతి
  • రష్యా సైన్యం నుంచి బయటకు వచ్చిన 96 మంది
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోయినట్టు విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో 126 మంది భారతీయులు పాల్గొన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. వీరిలో 96 మంది సైన్యం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. వీరిలో కొందరు స్వదేశానికి తిరిగొచ్చారని వెల్లడించారు. 

ఇప్పటి వరకు యుద్ధంలో పోరాడుతూ 12 మంది మరణించారని తెలిపారు. అక్కడే ఉండిపోయిన వారిని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


More Telugu News