వైట్ హౌస్ పై దాడి చేసిన హైదరాబాద్ యువకుడికి జైలు శిక్ష

వైట్ హౌస్ పై దాడి చేసిన హైదరాబాద్ యువకుడికి జైలు శిక్ష
  • 2024 మేలో వైట్ హౌస్ పై దాడి చేసిన సాయి కందుల
  • బ్యారికేడ్లను ట్రక్కుతో ఢీ కొట్టిన వైనం
  • ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
అమెరికా అధ్యక్షుడు నివాసం వైట్ హౌస్ పై దాడి చేసిన హైదరాబాద్ యువకుడు సాయి కందులకు అక్కడి కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టులో సాయి కందుల నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే నిందితుడి దాడి వెనుక కారణమని శిక్ష విధించే సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. 

సాయి కందుల వయసు 20 ఏళ్లు. హైదరాబాద్ లోని చందానగర్ లో జన్మించాడు. 2024 మే 13న వైట్ హౌస్ పై దాడి చేశాడు. రాత్రి 9.35 గంటలకు వైట్ హౌస్ వెలుపల ఉన్న బారికేడ్లను ట్రక్కుతో ఢీకొట్టాడు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు పెట్టారు. ఆ తర్వాత సాయి కందుల ట్రక్కు దిగి ట్రక్కు వెనక్కి వెళ్లాడు. ఆ తర్వాత నాజీ జెండా తీసి, ఎగురవేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు సాయిని అరెస్ట్ చేశాయి. తాజాగా కోర్టు అతనికి జైలు శిక్షను విధించారు. 


More Telugu News