నారావారిపల్లెలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

నారావారిపల్లెలో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
  • సొంతూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న చంద్రబాబు
  • నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వైనం
  • తల్లిదండ్రుల సమాధులను సందర్శించిన ప్రత్యేక పూజలు
  • కులదైవం నాగాలమ్మ తల్లి పుట్ట వద్ద కుటుంబంతో కలిసి పూజలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సంక్రాంతి సందర్భంగా సొంతూరు నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన అత్తమామలైన బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

అంతకుముందు, తమ కులదైవం నాగాలమ్మ తల్లి పుట్ట వద్ద చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 

చంద్రబాబు ఇవాళ సంక్రాంతి వేళ తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. 


More Telugu News