భూములు తీసుకోవద్దంటూ భోగి నాడు పొలాల్లో సకినాలు చేస్తూ నిరసన
- ఆరెపల్లి - పైడిపల్లి - కొత్తపేట గ్రామాల మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు
- ఈ ప్రతిపాదనతో విలువైన భూములు కోల్పోతున్నామని రైతుల ఆందోళన
- మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని డిమాండ్
రింగ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాలో కొందరు రైతులు సకినాలతో నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా వరంగల్ మండలంలోని ఆరెపల్లి - పైడిపల్లి - కొత్తపేట గ్రామాల మీదుగా 200 అడుగుల ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ ప్రతిపాదన కారణంగా తాము విలువైన భూములను కోల్పోతున్నామంటూ వరంగల్ మండలం ఆరెపల్లి శివారులోని పంట భూముల్లో సకినాలు చేస్తూ నిరసన తెలిపారు. నిన్న సోమవారం భోగి. ఈ క్రమంలో పలువురు రైతులు పంట పొలాల్లో సకినాలు పోస్తూ నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు.