నంద్యాల టోల్‌గేటు వద్ద బస్సులో మంటలు
- తిరువన్నామలై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
- అత్యవసర ద్వారం అద్దాలు పగులగొట్టి బయటపడ్డ ప్రయాణికులు
- నంద్యాల టోల్ గేటు వద్ద ఘటన
పండుగ వేళ పెనుప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైనా ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే .. తిరువన్నామలై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. నంద్యాల టోల్ గేటు సమీపంలో బస్సు టైరు పేలి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. టైర్ల నుంచి మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేశాడు. దీంతో ప్రయాణికులు కొందరు డోర్ నుంచి మరి కొందరు అత్యవసర ద్వారం అద్దాలను పగులగొట్టి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పండుగ పూట భారీ ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.