'గేమ్ ఛేంజ‌ర్' వ‌సూళ్ల‌పై రామ్ గోపాల్ వ‌ర్మ సెటైరిక‌ల్ ట్వీట్‌

'గేమ్ ఛేంజ‌ర్' వ‌సూళ్ల‌పై రామ్ గోపాల్ వ‌ర్మ సెటైరిక‌ల్ ట్వీట్‌
  • ఒక‌వేళ 'జీసీ' తొలి రోజు వ‌సూళ్లు రూ. 186 కోట్లు అయితే, 'పుష్ప 2' కలెక్షన్స్ 1,860 కోట్లు ఉండాల‌న్న ఆర్‌జీవీ
  • 'జీసీ'కి రూ. 450 కోట్ల ఖ‌ర్చ‌యితే.. 'ఆర్ఆర్ఆర్'కు రూ. 4500 కోట్లు ఖ‌ర్చ‌యి ఉండాలంటూ సెటైర్లు
  • 'గేమ్ ఛేంజ‌ర్' విష‌యంలో అబద్ధాలు న‌మ్మ‌ద‌గిన‌విగా ఉండాలన్న ద‌ర్శ‌కుడు
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన 'గేమ్ ఛేంజ‌ర్' మూవీ తొలి రోజు క‌లెక్ష‌న్ల‌పై నెట్టింట పెద్ద దుమారమే రేగిన విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ డే ఈ మూవీ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 186కోట్ల గ్రాస్ కలెక్ష‌న్స్ కొల్ల‌గొట్టింద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డంతో సోష‌ల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా 'గేమ్ ఛేంజ‌ర్' వ‌సూళ్ల‌పై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా స్పందించారు. ఈ మూవీ మొద‌టి రోజు వ‌సూళ్ల‌పై ఆయ‌న సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు.

"ఒక‌వేళ 'గేమ్ ఛేంజ‌ర్' తొలి రోజు వ‌సూళ్లు రూ. 186 కోట్లు అయితే, 'పుష్ప 2' కలెక్షన్స్ రూ. 1,860 కోట్లు ఉండాలి. 'గేమ్ ఛేంజ‌ర్‌'కు రూ. 450 కోట్ల ఖ‌ర్చ‌యితే అద్భుత‌మైన విజువ‌ల్స్ ఉన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు రూ. 4,500 కోట్లు ఖ‌ర్చ‌యి ఉండాలి. 'గేమ్ ఛేంజ‌ర్' విష‌యంలో అబద్ధాలు న‌మ్మ‌ద‌గిన‌విగా ఉండాలి. అయితే, వీటి వెనుక దిల్ రాజు ఉండ‌ర‌ని న‌మ్ముతున్నా" అంటూ ఆర్‌జీవీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.  


More Telugu News