చంద్రగిరిలో 'డాకు మహారాజ్ 'సినిమా చూసిన నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

చంద్రగిరిలో 'డాకు మహారాజ్ 'సినిమా చూసిన నారా లోకేశ్...  ఫొటోలు ఇవిగో!
  • సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె విచ్చేసిన మంత్రి లోకేశ్
  • నేడు కుటుంబ సభ్యులతో కలిసి ఎస్వీ సినిమాస్ లో డాకు మహారాజ్ సినిమా వీక్షణ
  • నారావారిపల్లెలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన లోకేశ్
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సంక్రాంతి సంబరాల కోసం కుటుంబ సమేతంగా స్వగ్రామం నారావారిపల్లె తరలివెళ్లిన సంగతి తెలిసిందే. 

ఇవాళ ఉదయాన్నే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్.... అనంతరం చంద్రగిరి ఎస్వీ సినిమాస్ లో డాకు మహారాజ్ సినిమా వీక్షించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నేడు నారా లోకేశ్, నారా బ్రాహ్మణి, లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్, ఆయన అర్ధాంగి తేజస్విని, చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు వీక్షించారు. 

ఇక, సంక్రాంతి వేడుకల కోసం సొంతూరుకు విచ్చేసిన నారా లోకేశ్ ఇక్కడ కూడా ప్రజలతో మమేకం అయ్యారు. స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో నిర్వహించిన ముగ్గుల పోటీలు, గ్రామీణ ఆటల పోటీలను సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి లోకేశ్, బ్రాహ్మణి ఆసక్తిగా తిలకించారు. ఈ పోటీల్లో దేవాన్ష్ స్వయంగా పాల్గొని సందడి చేశాడు. నారా కుటుంబ సభ్యులు గ్రామంలో కాలినడకన తిరిగి అక్కడి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నారా, నందమూరి కుటుంబాల రాకతో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి.


More Telugu News