ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో .. 8 మంది దుర్మరణం

ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో .. 8 మంది దుర్మరణం
  • నాసిక్ ముంబయి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
  • ఆరుగురు స్పాట్‌లో, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి
  • జిల్లా ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
ట్రక్‌ను టెంపో ఢీకొట్టిన ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ ముంబయి జాతీయ రహదారిపై ద్వారకా సర్కిల్ వద్ద జరిగింది. నిషాద్‌‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది తిరిగి టెంపోలో  సీఐడీసీవో ప్రాంతానికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది. ఎదురుగా ఇనుప చువ్వలు తీసుకువెళ్తున్న ట్రక్కును టెంపో డ్రైవర్ ఢీకొట్టాడు. 

దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరిని జిల్లా ఆసుపత్రికి, మరి కొందరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News