ఉత్తర ప్రదేశ్ కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో కూలిన పైకప్పు

ఉత్తర ప్రదేశ్ కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో కూలిన పైకప్పు
  • కూలిన పైకప్పు కింద పలువురు కార్మికులు
  • ఇప్పటి వరకు ఆరుగురిని కాపాడిన సిబ్బంది
  • ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న పైకప్పు ప్రమాదవశాత్తు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కూలిన పైకప్పు కింద దాదాపు 20 మంది ఉండవచ్చని భావిస్తున్నారు.

పోలీసులు, రైల్వే సిబ్బంది ఆరుగురిని కాపాడారు. వారికి గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మిగిలిన వారిని తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం రెండంతస్తుల నిర్మాణంలో పైకప్పు కూలిపోయింది.

ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలన్నారు. 


More Telugu News