మోకాళ్ల‌పై తిరుమల మెట్లెక్కిన సినీ న‌టి... ఇదిగో వీడియో

మోకాళ్ల‌పై తిరుమల మెట్లెక్కిన సినీ న‌టి... ఇదిగో వీడియో
  • తొలి ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ నందిని రాయ్
  • మెట్ల మార్గంలో మోకాళ్లపై ఏడుకొండలపైకి చేరుకున్న న‌టి
  • ఇందుకు సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌
సినీ న‌టి, బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ తాజాగా తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్నారు. తొలి ఏకాద‌శి సంద‌ర్భంగా ఆమె మెట్ల మార్గంలో మోకాళ్లపై ఏడుకొండలపైకి చేరుకుని, శ్రీవారిని దర్శించుకోవ‌డం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. 

ఇక, ఈ భామ తెలుగులో మాయ, వార‌సుడు, మోసగాళ్లకు మోసగాడు, శివరంజనీ, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నటించారు. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా ఆమె న‌టించారు. ఈ హైదరాబాదీ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించారు. 


More Telugu News