తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన బాలకృష్ణ

తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన బాలకృష్ణ
  • తిరుపతి ఘటన తనను ఎంతగానో కలిచివేసిందన్న బాలకృష్ణ
  • తిరుపతి ఘటన చాలా బాధాకరమన్న బాలకృష్ణ
  • డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ
రెండు రోజుల క్రితం వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరమని, ఇది తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జరగకూడని ఘటన జరిగిందన్నారు.

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన  'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి సందర్భంగా ఎల్లుండి విడుదలవుతోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ మొదట అనంతపురంలో నిర్వహించాలని భావించామని, తిరుపతి ఘటన నేపథ్యంలో అక్కడి ఈవెంట్‌ను రద్దు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు చిత్ర బృందం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.


More Telugu News