నేడు హైదరాబాద్ లో 'డాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • నిన్న అనంతపురంలో జరగాల్సిన 'డాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • తిరుపతి తొక్కిసలాట ఘటన కారణంగా రద్దైన ఈవెంట్
  • నేడు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన 'డాకు మహరాజ్' సినిమా ఈ నెల 12న  గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న అనంతపురంలో జరగాల్సి ఉంది. అయితే, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్స్ జారీ చేసే సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో ఈవెంట్ ను రద్దు చేశారు. 

ఈవెంట్ రద్దు కావడంతో బాలయ్య ఫ్యాన్స్ కొంత డీలా పడ్డారు. దీంతో వారి కోసం మరో ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఈ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.


More Telugu News