హిందీ జాతీయ భాష కాదన్న అశ్విన్ పై విమర్శల వెల్లువ
- చెన్నైలో ఓ కాలేేజీ స్నాతకోత్సవానికి వెళ్లిన అశ్విన్
- హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అశ్విన్ ప్రశ్న
- హిందీ అధికారిక భాష మాత్రమేనని వ్యాఖ్య
అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. హిందీ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశ్విన్ వెళ్లారు. అక్కడ కాసేపు విద్యార్థులతో మాట్లాడుతూ... హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు ఎంత మందికి అర్థమవుతాయని ప్రశ్నించారు. హిందీ అర్థమవుతుందని కొంతమంది నుంచే సమాధానం వచ్చింది. దీంతో అశ్విన్ మాట్లాడుతూ... హిందీ అధికారిక భాష మాత్రమేనని, జాతీయ భాష కాదని చెప్పారు. అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.