చిరు వ్యాపారికి రూ. 210 కోట్ల కరెంట్ బిల్

  • హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ జిల్లా జట్టాన్ గ్రామంలో ఘటన
  • రూ. 4,047 బిల్లుకు బదులుగా రూ. 210 కోట్ల బిల్లు
  • సాంకేతిక లోపం వల్ల అధిక బిల్లు వచ్చిందన్న అధికారులు
రెగ్యులర్ గా వచ్చే కరెంట్ బిల్లు కొంచెం పెరిగినా కంగారు పడిపోతుంటాం. అలాంటిది ఏకంగా కోట్లలో కరెంట్ బిల్లు వస్తే..? వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ జిల్లా జట్టాన్ గ్రామానికి చెందిన చిరు వ్యాపారి లలిత్ ధిమాన్ కు సాధారణంగా రూ. 3 వేల లోపే కరెంట్ బిల్లు వచ్చేది. అలాంటిది తాజాగా రూ. 2,10,42,08,405 బిల్లు రావడంతో ఆయన షాక్ తిన్నాడు. విద్యుత్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. 

బిల్లు రికార్డులను పరిశీలించిన అధికారులు సాంకేతిక లోపం వల్లే అధిక బిల్లు వచ్చిందని పేర్కొన్నారు. బిల్లు రూ. 4,047 అని సవరించడంతో లలిత్ ఊపిరి పీల్చుకున్నాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ లో టైలర్ పని చేసే అన్సారీకి రూ. 86 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది.


More Telugu News