గ్రామాల పర్యటనకు రెడీ అవుతున్న పవన్.. గ్రామాల్లోనే టెంట్ లలో బస
- సంక్రాంతి తర్వాత గ్రామాల పర్యటనకు పవన్
- ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటన
- నేడు పిఠాపురంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా ప్రజలతో మమేకం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామాల పర్యటనను చేపడుతున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన టెంట్ లో బస చేసి... అదే క్యాంప్ కార్యాలయంగా విధులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి గ్రామాల పర్యటనకు పవన్ శ్రీకారం చుట్టనున్నారు.
మరోవైపు పవన్ నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని, అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు ప్రారంభోత్సవాలను వర్చువల్ గా చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు.