ఫార్ములా ఈ-కార్ కేసు.. ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి
- రేసు జరిగిన సమయంలో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి
- హెచ్ఎండీఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేశారంటూ ఆయనపై ఆరోపణలు
- నిన్న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. రేసు జరిగిన సమయంలో ఆయన హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ గా ఉన్నారు. ఆ సమయంలో రేసును నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
ఈ కేసులో బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉండగా... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ లను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరున్నర గంటల సేపు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ... ఏసీబీ విచారణకు పూర్తి స్థాయిలో సహకరించానని చెప్పారు. ఎప్పుడు పిలిచినా, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని ఏసీబీ అధికారులకు చెప్పానని తెలిపారు. ఇది ఒక చెత్త కేసు అని అన్నారు.