తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాందేవ్ బాబా, రాజకీయ ప్రముఖులు

  • వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు
  • ఉదయం 3.45 గంటల నుంచి దర్శనానికి అనుమతించిన అధికారులు
  • శ్రీవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున అభిషేక సేవ అనంతరం... ఉదయం 3.45 గంటల నుంచి అధికారులు దర్శనానికి అనుమతించారు. పలువురు రాజకీయ ప్రముఖులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధర, నందమూరి సుహాసిని తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.


More Telugu News