నేటి నుంచి ఓటీటీలో అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి'
అల్లరి నరేశ్, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘బచ్చల మల్లి’ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా నేటి నుంచి ‘ఈటీవీ’ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అయింది. నెల రోజులు కూడా కాకుండానే అప్పుడే ఓటీటీకి వచ్చేసింది.
చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైన బచ్చల మల్లికి తండ్రి అంటే ఎంతో ఇష్టం. అయితే, తండ్రి తీసుకున్న ఓ నిర్ణయంతో బచ్చల మల్లి చిన్న వయసులోనే చెడు దారి పడతాడు. కాలేజీ చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి ట్రాక్టర్ నడుపుతుంటాడు. గొడవల్లో దూరుతుంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ కథ.