కిడ్నీ సమస్య, యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే... ఈ పప్పులకు దూరంగా ఉండాలి!
- మారిన జీవన శైలితో శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ సమస్య
- అధికంగా మాంసాహారం, జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తో ఇబ్బంది
- అదే సమయంలో కొన్ని రకాల పప్పు ధాన్యాలతోనూ ఇబ్బంది ఉంటుందంటున్న నిపుణులు
మారిన జీవన శైలితో ఇటీవలి కాలంలో అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా పేరుకుపోవడం వల్ల... తీవ్ర నీరసం నుంచి మానసిక సమస్యల వరకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీల పనితీరు కూడా దెబ్బతింటుంది. భవిష్యత్తులో మరింత తీవ్రమైన అనారోగ్య సమస్యలకూ దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అధికంగా మాంసాహారం, జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం ఈ సమస్యకు కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని రకాల పప్పు ధాన్యాలకూ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వాటితో యూరిక్ యాసిడ్ సమస్య పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కిడ్నీల పనితీరు సరిగా లేనివారు కూడా ఈ పప్పు ధాన్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
యూరిక్ యాసిడ్ సమస్యను పెంచే పప్పు ధాన్యాలు ఇవే...
ఇది గుర్తుంచుకోండి
పప్పు ధాన్యాలు ఏవైనా మనకు మంచి పోషకాలను ఇచ్చేవేనని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా శాకాహారులకు తగిన స్థాయిలో ప్రొటీన్లు అందాలంటే... ఆహారంలో పప్పు ధాన్యాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అయితే అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన మందులు వాడటం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సలహాకు అనుగుణంగా ఆహారంలో మార్పులు, చేర్పులు చేసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

- బఠానీలు, శనగల్లో ప్యూరిన్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అవి మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగేందుకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
- అదే తరహాలో రాజ్మా (కిడ్నీ బీన్స్)లో, మినపపప్పులో కూడా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకుంటే ఇబ్బందేనని పేర్కొంటున్నారు.
- కందిపప్పు, మైసూర్ పప్పులలో కూడా ప్యూరిన్స్ ఉంటాయని... అయితే వీటిని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదుగానీ, అధిక మొత్తంలో తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.