ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు
- ఈ నెల 14న ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి
- 14, 15, 16 తేదీల్లో దేశ రాజధానిలో సీఎం పర్యటన
- 17 నుంచి సింగపూర్, 19 నుంచి దావోస్‌లో పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దైంది. ఈ నెల 14న ఢిల్లీకి వెళుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మూడు రోజులు కొనసాగనుంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆయన దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. 15న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు.
అయితే, ఈ నెల 17న ఆయన ఢిల్లీ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తారు. ఆ తర్వాత 19న సింగపూర్ నుంచి దావోస్ వెళ్లనున్నారు. 23వ తేదీ వరకు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.